Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్రాండ్ల రారాజు కోహ్లీ.. కానీ పెప్సీ వద్దంటున్నాడు. ఇంత మార్పా?

హైదరాబాద్, మంగళవారం, 6 జూన్ 2017 (03:44 IST)

Widgets Magazine
virat kohli - anushka sharma

అటు మైదానంలోనూ ఇటు ప్రకటనల రంగంలోనూ అత్యంత దూకుడు కనబరుస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంత సాధువైపోయాడేంటి అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అవును మరి. నిజంగానే దూకుడుతనపు కోహ్లి మారిపోయాడు... ప్రస్తుతం క్రికెట్ ఫీల్ట్ లోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా 18 ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అతను, ఇకపై తాను వాడే, తనకు నచ్చిన వాటికే అంబాసిడర్‌గా ఉంటానన్నాడు. అందులో భాగంగా పెప్సీతో ఒప్పందాన్ని పునరుద్ధరించుకోరాదని నిర్ణయించుకున్నాడు. 
 
గత ఆరేళ్లుగా పెప్సీ కూల్‌ డ్రింక్‌తో కోహ్లికి అనుబంధం ఉంది. నేరుగా పెప్సీ అని పేరు చెప్పకపోయినా, ఈ సంస్థతో కాంట్రాక్ట్‌ పొడిగించుకోవద్దని తీసుకున్న నిర్ణయం అతని ఆలోచనలను చూపించింది. ‘కొన్నాళ్లుగా నా ఫిట్‌నెస్‌పై బాగా దృష్టి పెట్టాను. దానికి ఇబ్బంది కలిగించే వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. పేర్లు చెప్పను కానీ కొన్ని ఉత్పత్తులను నేను వాడటం లేదు. కేవలం డబ్బులు తీసుకుంటున్నాను కాబట్టి అలాంటి వాటిని ప్రమోట్‌ చేస్తూ వాడమని అభిమానులకు చెప్పలేను’ అని ఇటీవల కోహ్లి వ్యాఖ్యానించాడు. 
 
అయితే కూల్‌ డ్రింక్‌ కాకుండా పెప్సికో కంపెనీకి సంబంధించిన హెల్త్‌ బ్రాండ్‌ కోసం కోహ్లితో చర్చలు జరుపుతున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇన్నాళ్లకన్నా పాటించని దానికోసం డబ్బులు తీసుకుని అభిమానులను మోసం చేయడం ఇష్టం లేక తానే మారినందుకు కోహ్లీపట్ల అభిమానుల్లో మరింత క్రేజ్ పెరిగింది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పాకిస్థాన్ గెలుస్తుందని.. ఒంటెతో జోస్యం చెప్పిన పాక్ జర్నలిస్ట్.. అయితే సీన్ రివర్సైంది..

ఒంటె జోస్యం ఫలించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్లు ఆదివారం నువ్వానేనా అంటూ ...

news

బ్యాట్స్‌మన్ ఉతికేశారు.. బౌలర్లు కుమ్మేశారు. పాక్‌పై టీమిండియా ఘనవిజయం

భారత్-పాక్ క్రికెట్ జట్ల మధ్య ఇంత చప్పగా ముగిసిన పోటీ ఆదివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన ...

news

యువరాజ్ అందుకు అవసరం.. పాండ్యా ఇందుకు అవసరం

ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా మూడు వరుస సిక్స్‌లను చూసి ...

news

లక్ష్యం పెరిగిన పాకిస్తాన్.. మళ్లీ వర్షంతో ఆగిన మ్యాచ్.. పాక్ 22/0

ఐసీసీ చాంపియన్స్ టోర్నీలో టీమిండియా విధించి 324 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ...

Widgets Magazine