శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (12:40 IST)

మూడువేల పరుగుల మార్కును సాధించిన పుజారా.. సచిన్, ద్రవిడ్ సరసన నిలిచిపోయాడు..

విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో మూడు వేల పరుగుల మార్కుకు చేరిన టీమిండియా స్టార్ ప్లేయర్ పుజారా.. రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా మూడువేల పరుగుల ఘనతను సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా పుజారా ని

విశాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో మూడు వేల పరుగుల మార్కుకు చేరిన టీమిండియా స్టార్ ప్లేయర్ పుజారా.. రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా మూడువేల పరుగుల ఘనతను సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా పుజారా నిలిచాడు. తద్వారా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ద వాల్ రాహుల్ ద్రవిడ్‌లు కూడా 67 ఇన్నింగ్స్‌ల్లోనే మూడు వేల పరుగులు సాధించారు. ప్రస్తుత రికార్డుతో పుజారా సచిన్, రాహుల్ ద్రవిడ్ సరసన నిలిచిపోయాడు. 
 
కాగా ఇంగ్లండ్‌తో విశాఖలో జరిగే టెస్టు ద్వారా 67 ఇన్నింగ్స్ ఆడుతున్న పుజారాకు కెరీర్‌లో ఇది 40వ టెస్టు మ్యాచ్. ఈ క్రమంలోనే టెస్టుల్లో 9 సెంచరీలు, పది హాఫ్ సెంచరీలను పుజారా సాధించాడు. పుజారా, సచిన్, రాహుల్ ద్రవిడ్‌ల కంటే ముందు సెహ్వాగ్ 55 ఇన్నింగ్స్‌ల్లో 3వేల పరుగుల మైలురాయిని పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో అజారుద్ధీన్ (64), గవాస్కర్ (66)లు ఉన్నారు.