గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2016 (15:16 IST)

ముంబైలో ఇంగ్లండ్‌తో టెస్టు.. విరాట్ కోహ్లీ రికార్డుల పంట.. కెరీర్‌లో 15వ సెంచరీ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అంతేగాకుండా కొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా కోహ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అంతేగాకుండా కొత్త రికార్డులను నమోదు చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు ద్వారా కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో 15వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు.

కోహ్లీ 187 బంతులు ఎదుర్కోగా అందులో 11 ఫోర్లు బాదాడు. విరాట్‌కు జతగా జయంత్ యాదవ్ క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుత స్కోర్ 121 ఓవర్లకు 371/7. ఇప్పటికే భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 తేడాతో ముందు నిలవగా ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది.
 
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ముంబై టెస్ట్‌లో కోహ్లీ రెండు ఘ‌న‌త‌ల‌ను సాధించాడు. ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో వెయ్యి ర‌న్స్ పూర్తి చేసిన ఇండియన్ క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించాడు. 2011 సంవ‌త్స‌రంలో రాహుల్ ద్రావిడ్ కూడా ఒకే ఏడాదిలో వెయ్యి ప‌రుగులు స్కోర్ చేశాడు. ఇప్ప‌టికే ఈ ఏడాదిలో కోహ్లీ మొత్తం 11 టెస్ట్‌లు ఆడాడు. అందులో 211 అత్యధిక స్కోర్. 
 
ఈ ఏడాదిలో టెస్టుల్లో వెయ్యి ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ల‌లో కోహ్లీ నాలుగ‌వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌కు చెందిన బెయిర్‌స్ట్రో, కుక్‌, రూట్‌లు కూడా ఈ ఘ‌న‌తను సాధించారు. ముంబై టెస్ట్‌లో కోహ్లీ మ‌రో మైలురాయిని కూడా అందుకున్నాడు. 
 
టెస్టు కెరీర్ లో మొత్తం 4వేల పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. అతి త‌క్కువ మ్యాచ్‌ల్లో 4వేల మైలురాయిని చేరుకున్న ఆర‌వ భార‌త బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. గ‌తంలో సెహ్వాగ్‌, స‌చిన్‌, ద్రావిడ్‌, అజ‌హ‌ర్‌, గ‌వాస్క‌ర్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు.