Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

థర్డ్ టెస్ట్ మ్యాచ్ : విజయం దిశగా సౌతాఫ్రికా

శనివారం, 27 జనవరి 2018 (17:58 IST)

Widgets Magazine
ind - sa

జోహన్స్‌బర్గ్‌ వేదికగా జరుగుతున్న ద‌క్షిణాఫ్రికా, భారత్ చివ‌రి టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లోభారత్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సఫారీల ముంగిట 241 పరుగుల విజయ లక్ష్యంగా నిర్ధేసించింది. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సఫారీలు రెండో ఇన్నింగ్స్‌లో భోజనవిరామ సమయానికి ఆమ్లా, ఎల్గర్‌లు కలిసి పటిష్టమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 247 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో 241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు మూడో రోజే ఓపెనర్ మార్క్‌రం వికెట్ కోల్పోయింది. 
 
నాలుగో రోజు 17/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆమ్లా, ఎల్గర్‌ కలిసి రెండో వికెట్‌కి 64 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించారు. భారత పేస్‌ని ధీటుగా, వికెట్లు కాపాడుకుంటూ.. పరుగులు రాబట్టేందుకు వీరిద్దరు ప్రయత్నం చేస్తున్నారు. 
 
మరోవైపు గెలిచి తీరాల్సిన ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్‌లు పడగొట్టేందుకు భారత బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. దీంతో భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. భారత్‌పై విజయం సాధించేందుకు దక్షిణాఫ్రికా ఇంకా 172 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజ్‌లో ఆమ్లా(27), ఎల్గర్(29) ఉన్నారు. 
 
241 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. స్కోరు 17 ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 42గా ఉంది. మార్క్‌రమ్ 4 పరుగులకే షమీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్ 17, హషిమ్ ఆమ్లా 12 పరుగులతో ఉన్నారు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 187 పరుగులకి ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 194 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా గెలవాలంటే మరో 199 పరుగులు చేయాల్సి ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

అంగట్లో ఆటగాళ్లు.. ఆ క్రికెటర్ ధర రూ.12.50 కోట్లు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ కోసం క్రికెటర్ల అమ్మకం కోసం వేలం పాటలు శనివారం ...

news

క్రిస్ గేల్‌కు షాక్.. రాహుల్‌కు జాక్‌పాట్

వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్‌కు షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ...

news

బౌలింగ్ చేస్తూ కుప్పకూలి చనిపోయిన యువ బౌలర్

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువ బౌలర్.. బౌలింగ్ చేస్తూ కుప్పకూలి కన్నుమూశాడు. ఈ విషాదకర ...

news

తీరు మారని భారత బ్యాట్స్‌మెన్... భారత్ మళ్లీ పాతకథ

మూడో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్ తీరు మారలేదు. సౌతాఫ్రికాతో బుధవారం నుంచి ప్రారంభమైన ...

Widgets Magazine