గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 1 జులై 2015 (15:26 IST)

ప్రపంచంలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలిబ్రిటీల జాబితాలో ధోని...

ప్రపంచ స్థాయిలో అత్యధికంగా సంపాదిస్తున్న సెలిబ్రిటీల జాబితాలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చేరిపోయారు. 2014 ఏడాదికి గాను అత్యధికంగా సంపాదిస్తున్న 100 మంది సెలబ్రిటీల జాబితాని ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది. ఈ జాబితాలో మన దేశంలోని బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతో పాటు టీమిండియా క్రికెటర్ ధోని స్థానం పొందారు.


 
ఈ ఏడాదికి 22 కోట్ల రూపాయల ఆదాయంతో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ఇద్దరు 71వ స్థానంలో ఉండగా, 21 కోట్ల రూపాయల రాబడితో అక్షయ్ కుమార్ 76వ స్థానంలో నిలిచారు. వీరి వరుసలో 20 కోట్ల రూపాయల ఆదాయం పొందుతూ ధోని 82వ స్థానం దక్కించుకున్నారు. 
 
ఈ జాబితాలో ఏడాదికి 191 కోట్ల రూపాయల ఆదాయం పొందుతూ అమెరికన్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ మొదటి స్థానంలో నిలవగా, సింగర్ టేలర్ స్వీఫ్ట్ 8వ స్థానంలోను, టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్ 16వ స్థానంలో నిలిచారు. అదేవిధంగా టైటానిక్ ఫేం లియోనార్డో డికాప్రియా 19 కోట్ల ఆదాయంతో 89వ స్థానం దక్కించుకున్నారు.