బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 జులై 2015 (11:10 IST)

గులాబీ బంతితో ధోనీ బౌలింగ్: వీడియోకు భారీ క్లిక్స్

భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ గులాబీ బంతి విసిరాడు. కొత్తగా క్రికెట్లో ప్రవేశపెట్టాలని భావిస్తూ, తయారు చేయించిన గులాబీ రంగులోని బంతిని ధోనీ పరిశీలించాడు. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో ఈ బంతులను వాడాలన్న నిర్ణయంపై క్రికెట్ ప్రపంచంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధోనీ కూడా ఈ బంతిని విసిరి పరిశీలించాడు. 
 
ప్రాక్టీసు చేస్తున్న బ్యాట్స్ మెన్‌కు గులాబీ బంతితో బౌలింగ్ చేశాడు. దీన్ని వీడియో తీసిన ఆసీస్ క్రికెట్ బోర్డు డే అండ్ నైట్ టెస్టుల కోసం 'ధోనీ పోషించిన చిన్న పాత్ర' అంటూ దాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోకు ప్రస్తుతం క్లిక్‌ల మీద క్లిక్స్ వస్తున్నాయి.