గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2015 (16:56 IST)

గ్రేట్ ప్లేయర్లలో ధోనీ ఒకడు.. ఆయన దరిదాపుల్లోకి ఎవ్వరూ రాలేరు: రవిశాస్త్రి

క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ధోనీ కూడా ఒక్కడని టీమిండియా జట్టు డైరక్టర్ రవిశాస్త్రి కితాబిచ్చాడు. టీమిండియా వన్డే, టీ20ల కెప్టెన్ ధోనీపై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. ధోనీ సూపర్ ప్లేయర్ అని.. వేరే కెప్టెన్ ఎవరైనా సరే కనీసం కూల్ కెప్టెన్ దరిదాపుల్లోకి రాలేరని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ధోనీ సాధించిన విజయాలే అతని గురించి మాట్లాడుతాయని.. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. 
 
దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌ను ఒక ఛాంపియన్ కెప్టెన్ నాయకత్వంలో టీమిండియా ఆడుతోందని ధోనీ గుర్తు చేశాడు. రానున్న నెలల్లో టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చడమే తమ లక్ష్యమని రవిశాస్త్రి వెల్లడించాడు. ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా టీమిండియాను విజయాల దిశగా నడిపించే భవిష్యత్తు కార్యాచరణలో సాయపడటానికి సిద్ధంగా ఉన్నాడని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.