బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 27 జూన్ 2015 (12:39 IST)

కెప్టెన్సీకి మరో యేడాది పాటు రాజీనామా చేసే ప్రసక్తే లేదు : మెక్ కల్లమ్

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవిని ఇప్పట్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ జట్టు కెప్టెన్, డాషింగ్ ఓపెనర్ బ్రెండెన్ మెక్ కల్లమ్ తేల్చి చెప్పారు. ఖచ్చితంగా మరో యేడాది పాటు కెప్టెన్‌గా కొనసాగుతానని తేల్చి చెప్పాడు. 
 
ఈ యేడాది జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ జట్టును విజయపథంలో నిలిపిన విషయం తెల్సిందే. అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత ఈ డాషింగ్ ఓపెనర్ తన జోరునుకొనసాగించలేకపోయాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కివీస్ జట్టు ఇప్పటికీ కోలేకోలేక పోయింది. 
 
ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన ఒక ట్వంటీ20 మ్యాచ్, వన్డే సిరీస్‌లలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ వరుస పరాజయాలతో మెక్ కల్లమ్ కెప్టెన్సీపై అనేక రకాలైన విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ మెక్ కల్లమ్‌ సారథ్యంపై సెలెక్టర్లు నమ్మకముంచి కెప్టెన్‌గా కొనసాగించారు. దీంతో మరో ఏడాది కెప్టెన్‌గా మెక్ కల్లమ్ కొనసాగనున్నాడు.