బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (14:04 IST)

42వ ఏట అడుగెట్టిన సచిన్: మాస్టర్‌కు ట్వీట్ల వెల్లువ!

అంతర్జాతీయ క్రికెట్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 42వ ఏటలోకి అడుగుపెట్టాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు అభిమానులు, ప్రముఖులు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. హ్యాపీ బర్త్ డే సచిన్ అంటూ నెట్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
సచిన్ టెండూల్కర్ అంతర్జాకీయ క్రికెట్ నుండి రిటైర్ అయినప్పటికీ అతని పైన అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సచిన్ ఎక్కడకు వచ్చినా అతని కోసం ఎగబడుతుంటారు. ఎక్కడకు వెళ్లినా సచిన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8(ఐపీఎల్), ప్రపంచ కప్ 2015లోను సచిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నేపథ్యంలో సచిన్‌కు ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి. యువ క్రికెటర్లకు సచిన్ ఆదర్శమని వ్యాఖ్యానించారు.