శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2015 (11:09 IST)

పాంటింగ్ చెప్తే హార్బర్ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకమన్నా దూకేస్తా: మైకేల్ క్లార్క్

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ హార్బర్ బ్రిడ్జిపై నుంచి నదిలో దూకేయమన్నా దూకుతానని ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైకేల్ క్లార్క్ తన తాజా పుస్తకంతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల 'యాషెస్ డైరీ 2015' పుస్తకంలో మాజీ కోచ్ జాన్ బుచానన్‌పై అంతెత్తున లేచాడు. బుచానన్ కన్నా తన పెంపుడు కుక్క 'జెర్రీ', ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు మెరుగైన కోచింగ్ ఇవ్వగలదన్నాడు. 
 
దేశానికి ఆడుతూ కూడా మందు కొట్టి వచ్చే సైమండ్స్‌కు తనను విమర్శించే హక్కు లేదని విరుచుకుపడ్డారు. మరొకరి నాయకత్వ లక్షణాలను విమర్శించేంత గొప్పవాడిని కాదని చెప్పాడు. ఇంకా హెడెన్‌పైన కూడా మైకేల్ క్లార్క్ విమర్శలు గుప్పించాడు. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో విమర్శించిన వారందరినీ ఈ పుస్తకంలో క్లార్క్ ప్రస్తావించాడు.