గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (10:51 IST)

క్రికెట్ ఆడేందుకు రాను.. ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తా: జాన్సన్

ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్ గతవారం అన్ని ఫార్మాట్‌ల నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. గాయాల బారిన పడకుండా.. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలోనే జాన్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం విశేషం. దీంతో ఆసీస్ కోచ్ డారెన్ లీమన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ కలిసి జాన్సన్‌ను వన్డేల్లోనైనా కొనసాగాలని కోరారు. అయితే జాన్సన్ అందుకు నో చెప్పాడు. కుటుంబంలో గడిపేందుకే తాను రిటైర్మెంట్ తీసుకున్నానని వారికి స్పష్టం చేశాడు. 
 
జాన్సన్ రిటైర్మెంట్‌పై లీమన్ మాట్లాడుతూ.. మేమిద్దరం క్రికెట్ ఆడాలి రమ్మని పిలిపిస్తే.. ఆడను ఇంట్లో కూర్చుని క్రికెట్ చూస్తానంటున్నాడని చమత్కరించాడు. జాన్సన్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా పేస్ విభాగం కొంత బలహీనపడిందని, మిచెల్ స్టార్క్ రాణిస్తున్నప్పటికీ సిడెల్, పాటిన్సన్, హేజిల్ వుడ్ తమ సత్తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
 
కాగా.. క్రికెట్‌లో వన్డే కెరీర్‌కు, వన్డే కెరీర్‌కు స్వస్తి చెప్పి టెస్టులకు, ఇంకొందరు వన్డేలకు, టెస్టులకు గుడ్ బై చెప్పి ట్వంటీ-20 ఫార్మాట్‌లో కొనసాగుతారు. అయితే వీరందరికీ భిన్నంగా ఆసీస్ పేస్ బౌలర్ అయిన మిచెల్ జాన్సన్ గతవారం అన్ని ఫార్మాట్‌లకు స్వస్తి చెప్పాడు.