Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శునకాలకు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న ధోనీ.. వీడియో చూడండి.. చెప్పిన మాట ఎలా వింటున్నాయో?

శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (16:51 IST)

Widgets Magazine

టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సేపు గడిపేందుకు సమయం కేటాయిస్తున్నారు. సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు స్వస్తి పలికిన ధోనీ ప్రస్తుతం వన్డే, ట్వంటీ-20 సిరీస్‌లు లేకపోవడంతో ఇంటికి పరిమితమయ్యారు. ధోనీ తన కూతురు జీవా, పెంపుడు కుక్కలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 
 
ధోనీకి బైకులు, శునకాలంటే ఇష్టం. కొత్త స్టైల్ బైకులను తీయడంలో ధోనీకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అలాగే శునకాలను పెంచడం వాటితో ఆడుకోవడం అంటే కూడా ధోనీకి ప్రీతి. నిన్నటి నిన్న జీవాతో కలిసి పాకుతున్న వీడియోను పోస్ట్ చేసిన ధోనీ.. తాజాగా తన మూడు పెంపుడు కుక్కలకు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న వీడియోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. 
 
ఈ వీడియోలో ధోని తన కుక్కలకు క్యాచ్ ఎలా పట్టాలో చెప్తుండటం.. అవి కూడా అతని మాటలను సీరియస్‌గా వింటున్నట్లు కనిపించాయి. ఈ వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేసిన రెండు గంటల్లోనే రెండున్నర లక్షల వ్యూస్ రావడం విశేషం. అంతేగాకుండా ఈ వీడియోకు భారీగా లైక్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బీసీసీఐ నుంచే ఐసీసీకి 80 శాతం ఆదాయం.. బీ కేర్ ఫుల్: రవిశాస్త్రి వార్నింగ్

బీసీసీఐ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నుంచి లబ్ధిపొందాలనుకుంటున్న వారికి ...

news

క్రికెట్ నిజమైన అంబాసిడర్ ధోనీ: అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం

టీమ్ ఇండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పదేళ్ల పయనం అసాధారణమైనదని భారత క్రికెట్ జట్టు ...

news

అటు కోహ్లీ, ఇటు అశ్విన్ ఇద్దరి కథా చూస్తామంటున్న ఆసీస్

మాటల యుద్ధం మొదలెట్టకుండా, మైండ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఆటపట్టించకుండా నిజమైన ఆటను ...

news

ఆస్ట్రేలియాకు చేదు అనుభవం: కిట్ బ్యాగుల్ని మోసుకుని.. వాళ్లే వ్యానుల్లో లోడ్ చేసుకున్నారు..

భారత్‌లో మరో పర్యాటక జట్టైన ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబై ఎయిర్‌పోర్టులో ...

Widgets Magazine