శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (06:38 IST)

క్రికెట్ నిజమైన అంబాసిడర్ ధోనీ: అనిల్ కుంబ్లే ప్రశంసల వర్షం

టీమ్ ఇండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పదేళ్ల పయనం అసాధారణమైనదని భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే కొనియాడారు. ధోనీ నాయకత్వ గుణాలు అనితర సాధ్యమైనవని ప్రశంసించిన కుంబ్లే.. క్రికెట్ క్రీడకు నిఖార్సయిన అంబాసిడర్‌ ధోనియే అని వ్యాఖ్యానించారు.

టీమ్ ఇండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ పదేళ్ల పయనం అసాధారణమైనదని భారత క్రికెట్ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే కొనియాడారు. ధోనీ నాయకత్వ గుణాలు అనితర సాధ్యమైనవని ప్రశంసించిన కుంబ్లే.. క్రికెట్ క్రీడకు నిఖార్సయిన అంబాసిడర్‌ ధోనియే అని వ్యాఖ్యానించారు. ఎంఎస్ ధోనీ చిన్న పట్టణమైన రాంచీ నుంచి వచ్చాడు. రాంచీ కుర్రాడు దేశానిని నాయకత్వం వహిస్తాడని ఎవరూ ఊహించలేదు. పైగా పదేళ్లపాటు కెప్టెన్‌గా జట్టును అతడు నడిపిన తీరు చూస్తే అది అత్యంత కష్టభరితమైనది. కానీ పదేళ్లపాటు ఇండియా కెప్టెన్‌గా ఉండటం కనీవినీ ఎరుగనిది. జట్టు కెప్టెన్‌గా తననుతాను మల్చుకున్న తీరుకు ధోనికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే క్రీడకు నిజమైన అంబాసిడర్ ధోనీ అంటూ కుంబ్లే ఆకాశానికి ఎత్తేశాడు. 
 
ధోనీని ఏదీ దెబ్బతీయలేదు. అతను ఏం ఆలోచిస్తున్నాడో మీరు తెలుసుకోలేరు. కేవలం తన సాహసాన్ని మాత్రమే నమ్ముతాడు. రెండు ప్రపంచ కప్‌లు గెలవడం అద్భుతం, పైగా చాంపియన్స్ ట్రోపీ, టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం పరమాద్భుతం. ఇంతకుమించి మీరు ఎవరినుంచైనా ఆశించేది ఏమీ ఉండదు అంటూ కుంబ్లే పొగిడాడు.
 
టెస్టుల్లో, వన్డేల్లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కుంబ్లే పనిలో పనిగా విరాట్ కోహ్లీని కూడా ప్రశంసలవర్షంతో ముంచెత్తాడు. కోహ్లీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే మేధావి అని చెప్పవచ్చు. 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పటినుంచి అతడిని నేను చూస్తున్నాను.అండర్-19 ప్రపంచ కప్‌ని కెప్టెన్‌‌గా గెల్చుకువచ్చిన తర్వాత  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరాడు. అనాటి నుంచి ఈనాటివరకు అతడిలో వచ్చిన మార్పును మీరు ఇప్పుడు చూడవచ్చు. క్రికెటర్‌గా అతడు ఒక బ్రిలియంట్.  ఇతరులకు ప్రేరణ కలిగించడం కానీ, అంకితభావాన్ని ప్రదర్శించడంలో కానీ అతడికతడే సాటి అని కుంబ్లే ప్రశంసించాడు.