గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2015 (11:36 IST)

సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి అనుమానాలు!

కోల్ కతా నైటర్ రైడర్స్ తరపున ఆడుతున్న ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై మరోసారి అనుమానాలు తలెత్తాయి. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ తీరు పలు ప్రశ్నలు తలెత్తేలా చేసింది. దీంతో నరైన్‌ను మరోసారి చెన్నైలోని శ్రీరామచంద్రా ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌కు పంపి పరీక్షలు జరిపించాలని కోల్ కతా భావిస్తోంది. కాగా, గతంలో ఒకసారి నరైన్‌కు ఇవే తరహా పరీక్షలు నిర్వహించిన ఐసీసీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మైదానంలోని ఇద్దరు అంపైర్లు రిచర్డ్, వినీత్ కులకర్ణిలు నరైన్‌పై ఫిర్యాదు చేశారు.
 
కాగా గతంలో ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతున్న టైమ్‌లో న‌రైన్‌ను ఐసీసీ టెస్ట్ చేసి అత‌ని యాక్ష‌న్ స‌రైంద‌ని తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో సునీల్ న‌రైన్ ఆడేందుకు బీసీసీఐ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. బౌలింగ్ యాక్ష‌న్‌లో లోపాల‌తో చాంపియ‌న్స్ ట్రోఫీ చివ‌రి మ్యాచ్‌ల‌కు నిషేధం ఎదుర్కొన్న న‌రైన్‌కు ఎట్ట‌కేల‌కు బోర్డ్ ఓకే చెప్పింది. చెన్నైలో తుది ప‌రీక్ష‌ల త‌ర్వాత బోర్డ్ ఈ నిర్ణ‌యం తీసుకున్న సంగతి తెలిసిందే.