శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 31 జనవరి 2018 (10:36 IST)

149 ఫోర్లు... 65 సిక్సర్లు... 1045 పరుగులు...

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 13 యేళ్ల బుడతడు ఒకడు అండర్ 14 క్రికెట్ మ్యాచ్‌లో ఏకంగా 1,045 పరుగులు చేశాడు. అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కోపార

ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. 13 యేళ్ల బుడతడు ఒకడు అండర్ 14 క్రికెట్ మ్యాచ్‌లో ఏకంగా 1,045 పరుగులు చేశాడు. అండర్-14 ముంబై షీల్డ్ ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కోపార్ కహిరానె - నవీ ముంబై జట్ల మధ్య మంగళవారం జరిగిన సెమీ ఫైనల్  మ్యాచ్ జరిగింది. ఇందులో తనిష్క్ గవాటే అనే యువ క్రికెటర్ తన అద్భుత ఆటతీరుతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 
 
యశ్వంత్ రావ్ చవాన్ ఎలెవన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్ తాజాగా 515 బంతుల్లో 149 ఫోర్లు, 67 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్‌లో తనిష్క్ అజేయంగా 316 పరుగులు చేయడం విశేషం. అతడి బ్యాటింగ్ శైలిని, ఎనర్జీని చూసిన క్రీడా పండితులు ఆశ్చర్యపోతున్నారు.
 
కాగా, తనిష్క్ బ్యాటింగ్‌తో రెండేళ్ళ క్రితం నమోదైన రికార్డు చెరిగిపోయింది. భండారీ కప్ ఇంటర్-స్కూల్ టోర్నమెంట్‌లో భాగంగా ప్రణవ్ ధనవాడే అనే క్రికెటర్ 1,009 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడా రికార్డును తనిష్క్ తిరగరాశాడు. 1009 పరుగులు చేసిన ధనవాడే స్కూల్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. 1899లో అర్ధర్ కోలిన్స్ చేసిన 628 పరుగుల రికార్డును తుడిచిపెట్టేశాడు.