మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (16:17 IST)

ఓల్డ్ గోల్డ్.. ఓల్డ్ వైన్.. ఓల్డ్ ఫ్రెండ్స్.. ది బెస్ట్ : నవజ్యోత్ సింగ్ సిద్ధు

వారిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్.. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన క్రికెటర్లు. అయితే, ఓ చిన్నపాటి వివాదం వారి స్నేహానికి బ్రేకులు వేసింది. ఈ బ్రేక్ దాదాపు రెండు దశాబ్దాల (19 యేళ్లు)పాటు కొనసాగింది. ఇంతలో ఓ స్నేహితుడు డీప్ వీన్ త్రోంబోసిస్ వ్యాధికి లోనై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మరోమిత్రుడు తన చిరకాల స్నేహితుడుని పరామర్శించేందుకు విభేదాలను మరిచిపోయాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిని సిబ్బందితో.. నా పాత స్నేహితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అతన్ని చూడాలి... అనుమతించండంటూ ప్రాధేయపడ్డాడు. ఆ వ్యక్తి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి నవజ్యోత్ సింగ్ సిద్ధు.
 
 
1996లో ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో నాడు కెప్టెన్‌గా అజారుద్దీన్ శైలికి నిరసనగా క్రీజ్‌ నుంచి వాకౌట్ చేశాడు. ఇది భారత క్రికెట్‌లో పెను సంచలనమైంది. ఈ నేపథ్యంలో సిద్ధూ గత కొంతకాలంగా డీప్ వీన్ త్రోంబోసిస్ వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రికి వెళ్లిన అజ్జుభాయ్ 'నా సోదరుడు హాస్పిటల్‌లో ఉన్నాడు, చూడాలి' అంటూ అక్కడున్న హాస్పిటల్ స్టాఫ్‌కు ఆశ్చర్యాన్ని కలిగించాడు. 
 
దాదాపు 19 ఏళ్ల తర్వాత సిద్ధూ, అజార్ కలుసుకున్నారు. అజార్ తనను వెతుక్కుంటూ రావడంతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సిద్ధూ సంతోషాన్ని పట్టలేకపోయాడు. అజార్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడమే కాకుండా... పాత బంగారం, పాత వైన్, పాత స్నేహితులు (ఓల్డ్ గోల్డ్.. ఓల్డ్ వైన్.. ఓల్డ్ ఫ్రెండ్స్.. ది బెస్ట్) ఇప్పటికీ అపురూపమే అంటూ కామెంట్ పెట్టాడు. దటీజ్ ఫ్రెండ్‌షిప్.