శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మే 2016 (13:44 IST)

ఐసీసీ ర్యాంకింగ్స్: టీ-20ల్లో తొలిసారిగా నెం.1 స్థానంలో కివీస్.. భారత్ డౌన్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన తాజా ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కోల్పోయింది. ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌లో 0.21 పాయింట్ల స్వల్ప మార్పులతో రెండోస్థానానికి దిగజారింది. ఫలితంగా టీ-20 ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా కివీస్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ మూడో స్థానంలోనూ, దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వరుసగా ఐదు, ఆరు ఏడో స్థానాల్లో నిలిచాయి. శ్రీలంక 8వ స్థానంలో నిలిచింది.
 
ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డేల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. అలాగే దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇక శ్రీలంక ఐదో స్థానాన్ని ఇంగ్లండ్ ఆరు, బంగ్లాదేశ్ ఏడో ర్యాంకుల్లో నిలిచాయి. వెస్టిండీస్‌ ఎనిమిదో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా.. పాకిస్థాన్‌ 9వ స్థానానికి పడిపోయింది. 
 
వన్డే ర్యాంకింగ్స్ : ఆస్ట్రేలియా (124 పాయింట్స్), కివీస్ (113), దక్షిణాఫ్రికా (112), భారత్ (109), శ్రీలంక (104), ఇంగ్లండ్ (103), బంగ్లాదేశ్ (98), వెస్టిండీస్ (88), పాకిస్థాన్ (87), ఆప్ఘనిస్థాన్ (51), జింబాబ్వే (47), ఐర్లాంజ్ (42)లు టాప్-12లో నిలిచాయి.
 
ట్వంటీ-20 ర్యాంకింగ్స్: కివీస్ (132 పాయింట్లు), భారత్ (132), వెస్టిండీస్ (122), దక్షిణాఫ్రికా (119), ఇంగ్లండ్ (114), ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, జింబాబ్వే, స్కాట్లాండ్, దుబాయ్, ఇర్లాండ్ టాప్ -15లో నిలిచాయి.