గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 మార్చి 2017 (09:12 IST)

స్టీవ్ స్మిత్ వివాదం : మ్యాచ్‌లో భావోద్వేగాలు సహజమే .. ఐసీసీ

మైదానంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ళ మధ్య తీవ్ర భావోద్వేగాలు నెలకొనడం సహజమేనని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ్యాఖ్యానించింది. అందువల్ల బెంగళూరు టెస్ట్‌లో తలెత్తిన 'డీఆర

మైదానంలో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో ఇరు జట్ల ఆటగాళ్ళ మధ్య తీవ్ర భావోద్వేగాలు నెలకొనడం సహజమేనని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ్యాఖ్యానించింది. అందువల్ల బెంగళూరు టెస్ట్‌లో తలెత్తిన 'డీఆర్‌ఎస్' వివాదంపై ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై కానీ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీపై కానీ ఎటువంటి చర్య తీసుకోబోమని స్పష్టం చేసింది. 
 
మ్యాచ్‌ జరుగుతున్నప్పుడూ ముగిశాక ఉద్వేగాలు కొనసాగిన విషయాన్నీ ఐసీసీ ప్రస్తావించింది. 'ఐసీసీ కోడ్ ఆప్ కాండక్ట్ కింద ఏ ఆటగాడిపైనా అభియోగాలు మోపలేదు. ఆ సంఘటనల సందర్భాలను పరిగణనలోకి తీసుకుంటూ ఎటువంటి చర్య తీసుకోరాదని నిర్ణయించామ'ని ఐసీసీ మ్యాచ్ రిఫరీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
'ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ చూశాం. ఇరు జట్ల ఆటగాళ్లు సర్వశక్తులొడ్డారు. మ్యాచ్ జరుగుతున్నప్పుడూ తర్వాతా ఉద్వేగాలు కనిపించాయ'ని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ పేర్కొన్నారు. మూడో టెస్ట్‌పై శక్తియుక్తులను కేంద్రీకరించేలా ప్రోత్సహించేలా ఇరు జట్లను ప్రోత్సహిస్తామని, మ్యాచ్ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లను కూర్చోబెట్టి వారి బాధ్యతలను గుర్తు చేస్తార'ని వివరించింది.