శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (14:16 IST)

నేను ఇలా ఉండేందుకు ఐసీసీనే కారణం.. పీసీబీ నిర్లక్ష్యానికి కారణం కూడా అదే: ఆసిఫ్

స్పాట్ ఫిక్సింగ్‌తో ఐసీసీ క్లియరెన్స్ ఇవ్వడంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ అమిర్ పునరాగమనం చేసినా, ఆసిఫ్ మాత్రం ఇంకా జాతీయ జట్టులో ఆడలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కూడా ఆసిఫ్ ఎంపిక

స్పాట్ ఫిక్సింగ్‌తో ఐసీసీ క్లియరెన్స్ ఇవ్వడంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పేస్ బౌలర్ అమిర్ పునరాగమనం చేసినా, ఆసిఫ్ మాత్రం ఇంకా జాతీయ జట్టులో ఆడలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కూడా ఆసిఫ్ ఎంపికపై ఎటువంటి ముందడుగు వేయలేదు. ఇందుకు కారణం ఐసీసీ కారణమని ఆసిఫ్ తెలిపాడు. తన ఎంపికపై పీసీబీ నిర్లక్ష్యానికి ఐసీసీ నుంచి వారికి అందిన సమాచారమే కారణన్నాడు. 
 
తనను జాతీయ జట్టుకు ఎంపిక చేయకూడదని పీసీబీకి ఐసీసీ చెప్పినట్లు ఆసిఫ్ పేర్కొన్నాడు. దీనిపై ఆసిఫ్ విచారం వ్యక్తంచేశాడు. తాను రెగ్యులర్‌గ దేశవాళీ క్రికెట్ టోర్నీలు ఆడుతున్నానని చెప్పాడు. తనపై ఐసీసీ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు. తనకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఐసీసీ నుంచి గుర్తింపు లభిస్తుందనే అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. 
 
అసలు తనకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఎందుకు ఆడొద్దన్నారు అనే విషయం ఇప్పటికీ తనకు అర్తం కాలేదని, తనతో పాటు సల్మాన్ భట్ ఎప్పుడు జాతీయ జట్టుకు ఆడతాడని తెలియట్లేదని, కనీసం మా ప్రదర్శనను పరిగణలోకి తీసుకునే యత్నం కూడా చేయడంలేదని ఆసిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు.