Widgets Magazine Widgets Magazine

ధోనీ అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా.. అందుకే పాక్ జట్టు వణుకుతోందా?

హైదరాబాద్, శనివారం, 3 జూన్ 2017 (08:38 IST)

Widgets Magazine

దాయాదుల మధ్య ఇంకా ఆటే మొదలు కాలేదు. అయినా సరే టీమిండియాతో పోటీ అంటే పాకిస్తాన్ జట్టుకు, మాజీ ఆటగాళ్లకు భయం పుట్టుకొచ్చినట్లుంది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ అనే పేరు వింటే చాలు పాక్ క్రికెటర్లకు, అభిమానులకు చమటలు పడుతున్నాయి.  యధావిధిగా ఈసారి కూడా భారత్‌పై గెలుపు మాదే అంటూ ముందే మైండ్ గేమ్ మొదలెట్టాల్సిన పాకిస్తాన్ జట్టు, దాని అభిమానులు ధోనీ దెబ్బ కాచుకుంటే చాలు..  గండం గడిచినట్లే అంటూ జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు. 
ms dhoni
 
టీమ్ ఇండియా మొత్తం ఒకెత్తు. ధోనీ ఒకెత్తు చాలా జాగ్రత్త.. మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సా
టి ఎవరూ లేరంటూ పాక్ జట్టుకు దాని మాజీ క్రికెటర్లు ముందుస్తుగా హెచ్చరికలు చెబుతున్నారంటే ధోనీ పాక్ గుండెల్లో రేపుతున్నభయం ఏ స్థాయిలో ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో మైదానంలో ధోనీ పాత్రను అతడు కలిగించే ప్రభావాన్ని ప్రశంసించడంలో కూడా పాక్ మాజీ క్రికెటర్లు వెనక్కు తగ్గడం లేదు. పాక్ నుంచి ఇటీవలి కాలంలో దాయాది దేశానికి చెందిన ఆటగాళ్ల ప్రతిభకు ప్రశంసలు దక్కడం ఇద్దరి విషయంలేనే జరిగింది. వారు కోహ్లీ, ధోనీ.
 
తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు అమీర్ సొహైల్ పాక్ అటగాళ్లను ధోనీ విషయమై తీవ్రంగా హెచ్చరించాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో జరిగే కీలక పోరులో మహేంద్ర సింగ్ ధోనితో జాగ్రత్తగా ఉండాలని అమీర్ సొహైల్ తమ ఆటగాళ్లను హెచ్చరించాడు. అదే సమయంలో మ్యాచ్ గతిని మార్చడంలో ధోనికి సాటి ఎవరూ లేరంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోని విషయంలో పాక్ ఆటగాళ్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశాడు.
 
'ధోనికున్న పరిమితమైన వనరులతోనే మ్యాచ్‌లను గెలిపించిన సందర్భాలు అనేకం. అతను ఎప్పటికీ మ్యాచ్ విన్నరే. ధోని విషయంలో పాక్ జాగ్రత్తగా ఉండాలి. ధోని ఒక ప్రమాదకర బ్యాట్స్‌మన్ అనే సంగతి గుర్తుపెట్టుకుని ఆడండి'పాక్ మాజీ ఓపెనర్ సోహైల్ పేర్కొన్నాడు. 
 
ధోనీ బ్యాట్స్‌మన్ గానే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా అనేక మ్యాచ్‌లను గెలిపించిన విషయాన్ని సొహైల్ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ధోని క్రీజ్‌లో  కుదురుకుంటే మ్యాచ్‌ను తమవైపుకు లాగేసుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. 
 
కాగా చాంపియన్స్ ట్రోఫీలో జూన్ 4వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరుగనుంది. యధావిధిగా ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

టీమిండియా జట్టుపై గెలుపా.. పాకిస్తాన్‌కా.. మరో మాట మాట్లాడండి అనేసిన షాహిద్ అప్రిది

టీమ్ ఇండియా ప్రస్తుతం ఉన్న బీభత్సమైన ఫామ్‌లో ఆ జట్టును పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడించే ...

news

వెబ్ దునియా ఫ్యాంటసీ క్రికెట్ లీగ్ ఆడండి... రూ.2.5 లక్షల విలువ చేసే బహుమతులు గెల్చుకోండి...

వెబ్ దునియా తన పాఠకుల కోసం అద్భుతమైన క్రికెట్ లీగ్‌ను అందిస్తోంది. దీని ద్వారా పాఠకులు ...

news

అనిల్ కుంబ్లేపై లీక్ రూమర్.. టీమిండియా కొత్త కోచ్‌గా టామ్ మూడీ?

టీమిండియా హెడ్ కోచ్, మాజీ స్టార్ ప్లేయర్ అనిల్ కుంబ్లేపై కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. ...

news

ICC Champions Trophy, 2017 షెడ్యూల్ వివరాలు... మీకోసం...

ఐసీసీ చాంపియన్స్ షెడ్యూల్ వివరాలు ఇలా వున్నాయి. 01 Jun England vs Bangladesh in ...