Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిరుద్యోగులుగా మారనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఎందుకు?

మంగళవారం, 27 జూన్ 2017 (15:53 IST)

Widgets Magazine
australian cricketers

ఆస్ట్రేలియా క్రికెటర్లు నిరుద్యోగులుగా మారనున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి వారి ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. దీంతో వారు తమ ఉపాధిని కోల్పోయి నిరుద్యోగులుగా మారిపోనున్నారు. ఇప్పటికే పలువురు అగ్ర క్రికెటర్లు మానసికంగా కూడా సిద్ధపడిపోయారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఏంటి.. నిరుద్యోగులుగా మారిపోవడం ఏంటనే కదా మీ సందేహం.. అయితే, ఈ కథనం చదవండి. 
 
తమతో పాటు దేశంలో క్రికెట్ అభివృద్ధికి అవసరమైన క‌నీస అవ‌స‌రాలను కల్పించాలని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే, బోర్డు ఆదాయంలో కొంత వాటాను త‌మ‌కు ఇవ్వాల‌ని ప్లేయ‌ర్స్ ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అలా అయితే క్రికెట్ అభివృద్ధికి కిందిస్థాయిలో అవ‌స‌ర‌మైనంత నిధులు కేటాయించ‌లేమ‌ని సీఏ వాదిస్తున్న‌ది. 
 
ఇదే అంశంపై ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (క్రికెట్ బోర్డు)కి మ‌ధ్య గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఇప్పటివరకు స‌ఫ‌లం కాలేదు. పైగా, మున్ముందు కూడా వీరిమధ్య ఒప్పందం కుదురుతుందన్న నమ్మకం లేదు. అదేసమయంలో ప్రస్తుత ఒప్పందం ఈనెలాఖరుతో ముగియనుంది. 
 
అదేసమయంలో జులై 1 నుంచి ఆసీస్ క్రికెట‌ర్ల కొత్త కాంట్రాక్టులు ప్రారంభంకావాల్సి ఉంది. అయితే ఆలోపు ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్స్ అసోసియేష‌న్ (ఏసీఏ), క్రికెట్ ఆస్ట్రేలియా మ‌ధ్య ఓ ఒప్పందం కుద‌ర‌డం దాదాపు అసాధ్య‌మ‌ని ఏసీఏ బాస్ గ్రెగ్ డ‌య్య‌ర్ స్ప‌ష్టంచేశాడు. దీంతో నిరుద్యోగులుగా కావ‌డానికి ప్లేయ‌ర్స్‌ను మాన‌సికంగా సిద్ధం చేశామ‌ని డ‌య్య‌ర్ చెప్పాడు. జులై 1న 200 వ‌ర‌కు టాప్ ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు త‌మ ఉద్యోగాలు కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. 
 
ఇదిలావుండగా, గత శుక్ర‌వారం మ‌రో ప్ర‌తిపాద‌న‌తో సీఏ ముందుకు వ‌చ్చినా.. ప్లేయ‌ర్స్ నిరాక‌రించారు. ఈ సంక్షోభం ఇలాగే కొన‌సాగితే.. బంగ్లాదేశ్ టూర్‌, ఆ త‌ర్వాత భారత్‌తో వ‌న్డే సిరీస్‌, ఏడాది చివ‌ర్లో జ‌ర‌గాల్సిన యాషెస్ సిరీస్ జ‌ర‌గ‌డం కూడా అనుమానంగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

బోణీ కొట్టిన భారత్... విండీస్‌పై 105 పరుగుల తేడాతో ఘనవిజయం

కరీబియన్‌ పర్యటనలో భారత్‌ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు ...

news

మిస్టర్ కూల్ కాదు మిస్ కూల్.. పుస్తకంతో కొట్టిన మిథాలీ రాజ్

ఆడుతున్నది బలమైన ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో అనే విషయం కూడా పట్టించుకోకుండా తాపీగా పుస్తకం ...

news

కుంబ్లే కోచ్‌గా ఫెయిలయ్యాడా.. తనతో పనిలేకుండానే అన్ని సీరీస్ గెలిచామా.. గంగూలీ మాటలకు అర్థం ఏమిటి?

టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి, జట్టు సభ్యులకు మధ్య వ్యవహారం ...

news

రెండో వన్డేలో విరగబాదిన టీమిండియా.. విండీస్‌కు 311 పరుగుల విజయలక్ష్యం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌‌లో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ...

Widgets Magazine