గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (10:09 IST)

భారత్‌లో వరల్డ్ కప్ ట్వంటీ-20: పాక్‌తో ఆడేది లేనిది వారంలో తేలుతుంది: పీసీబీ

భారత్‌లో నిర్వహించనున్న ప్రపంచకప్ ట్వంటీ-20లో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో ఆడనుందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇంకా భారత్‌తో పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆడుతుందా అనేది వారం రోజుల్లో తేలిపోతుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డైరక్టర్ అంజాద్ హుస్సేన్ వెల్లడించారు. పాకిస్థాన్ సర్కారు భారత్‌లో ఆడేందుకు అనుమతిస్తే టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియాతో పాక్ ఆడుతుందని హుస్సేన్ తెలిపారు. 
 
ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆడేందుకు పాకిస్థాన్ జట్టు సిద్ధంగా ఉందని హుస్సేన్ వ్యాఖ్యానించారు. గతంలో భారత్‌లో పాకిస్థాన్ జట్టు పర్యటిస్తే దాడులకు గురయ్యే ప్రమాదం ఉందని పీసీబీ ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత్‌లో పర్యటించే ఏ జట్టుకైనా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయగల సామర్థ్యం బీసీసీఐకి ఉందన్న సంగతి విదితమే.