బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 12 జులై 2016 (09:53 IST)

అయ్య బాబోయ్.. ఈ ఆడాళ్ళతో వేగడం మహా కష్టం : హర్భజన్ సింగ్

ఆడవారి మనస్తత్వం గురించి భారత క్రికెట్ జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఆడాళ్లతో వేగడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు.

ఆడవారి మనస్తత్వం గురించి భారత క్రికెట్ జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ సరదా వ్యాఖ్యలు చేశారు. ఆడాళ్లతో వేగడం కష్టమేనని వ్యాఖ్యానించారు. ఆడాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
ఇదే అంశంపై భజ్జీ స్పందిస్తూ 'గర్భంతో ఉన్నా లేదా మామూలుగా ఉన్న ఆడాళ్లతో సమయం గడపడం చాలా కష్టమ'ని చెప్పాడు. ఆలుమగల మధ్య సదావగాహన ఉంటే సంసారం సాఫీగా సాగిపోతుందన్నాడు. 
 
కాగా, గత యేడాది అక్టోబరు నెలలో గీత (32)ను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భందాల్చివుంది. ఈ నెలాఖరుకు అతడి భార్య గీతా బస్రా బిడ్డను ప్రసవించనుంది. తన మొదటి సంతానం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నట్టు చెప్పారు. 
 
పసిబిడ్డను ఎలా పెంచాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి భార్యతో కలిసి ప్రి-నాటల్ క్లాసులకు వెళ్లినట్టు వెల్లడించాడు. తన బిడ్డ ఇంగ్లండ్‌లో పుడుతుందన్నారు. తమ కుటుంబంలోకి కొత్తగా రానున్న బుజ్జాయి కోసం షాపింగ్ మొదలు పెట్టానని భజ్జీ తెలిపాడు.