శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 నవంబరు 2015 (12:58 IST)

పీవీ సింధు అదుర్స్: మకావు ఓపెన్ విజేతగా నిలిచి సరికొత్త రికార్డు

మకావు ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో తెలుగు తేజం విజేతగా నిలిచి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన మినత్సు మితానిని మట్టికరిపించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రత్యర్థిపై ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్న సింధు.. 30 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని మట్టికరిపించింది.
 
మొదటి సెట్ సునాయాసంగా గెలుచుకున్న సింధుకు రెండో సెట్‌లో మితాని నుంచి గట్టిపోటీ ఎదురైనా.. గేమ్ పాయింట్ వరకు పోరాడిన సింధు 23-21 తేడాతో సంపూర్ణ విజయావకాశాన్ని కోల్పోయింది.

ఆ వెంటనే మూడో గేమ్ ప్రారంభం నుంచి ధాటిగా ఆడి 21- 14తేడాతో గెల్చుకుని వరుసగా మూడో ఏడాది మకావు ఓపెన్ విజేతగా రికార్డు సృష్టించింది. కాగా కాగా మకావు ఓపెన్‌ 2013, 2014లలో విజేతగా నిలిచిన ఈ తెలుగు తేజం 2015 టైటిల్ ను కూడా గెల్చుకోవడం ద్వారా అరుదైన 'హ్యాట్రిక్' నమోదు చేసుకోవడం గమనార్హం.