మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (11:57 IST)

భారత్‌ను ఓడించినందుకు సంతోషం.. క్రికెట్ దేశానికి పట్టిన చీడ: వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరో సారి అటువంటి వ్యాఖ్యలకు పాల్పడ్డాడు. ఈసారి క్రికెట్‌పై తన మాటల తూటాలు పేల్చాడు. టీమిండియా ఓడినప్పటి నుంచి రామ్ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. భారత్ ఓడించినందుకు చాలా చాలా సంతోషంగా వుందనీ, క్రికెట్ కంటే అమితంగా ద్వేషించేది క్రికెట్ ప్రేమికులనే అని వర్మ ట్విట్టర్లో పేర్కొన్నారు. మద్యపానం, ధూమపానం వ్యక్తిగతంగా నష్టపరుస్తాయి కానీ, క్రికెట్ దేశం మొత్తానికి పట్టిన ప్రమాదకర చీడ అని వర్మ ట్విట్టర్లో చెప్పాడు.
 
ఇండియాను మళ్ళీ మళ్ళీ చిత్తు చిత్తుగా ఓడించాలని ఇతర దేశాలను కోరాడు. దాని వల్ల ఇండియా క్రికెట్ ఆడటం మానేస్తుందని, దేశ వాసులు క్రికెట్ చూడటం మానివేసి, పనుల్లో నిమగ్నం అవుతారని వర్మ ట్వీట్ చేశాడు. 
 
నేను దేశాన్ని ప్రేమిస్తానని, క్రికెట్ వల్ల పని మానేసి జనాలు టీవీలకు అతుక్కుపోయి కూర్చుంటారని, దీని వల్ల ఎన్నో పని గంటలు కోల్పోవాల్సి వస్తుందని, అందుకే క్రికెట్‌ను ద్వేషిస్తానని వర్మ చెప్పారు. క్రికెటైటిస్ అనే ప్రమాదకర వ్యాధి నుంచి తన దేశ ప్రజలను కాపాడాలని అందరి దేవుళ్ళను ప్రార్థిస్తానని వర్మ అన్నారు.