Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏ గ్రేడ్‌పై మళ్లీ రగడ.. ధోనీకి మద్దతుగా బీసీసీఐ ప్రకటన అవసరమేమో?

హైదరాాబాద్, గురువారం, 6 జులై 2017 (08:00 IST)

Widgets Magazine

టీమంతా ఆడలేక చతికిల బడిన మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి కూడా జట్టును చివరి ఓవర్‌లో గెలిపించలేకపోయిన మహేంద్రసింగ్ ధోనీ దురదృష్టవంతుడనే చెప్పాలి. ధోనీపై అభిమానులు పెట్టుకునే నమ్మకం వమ్ము కాదని ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు? 35 ఏళ్లు పైబడిన వయసులో కుర్రాడిలాగా దూకుడు ప్రదర్శించడం ఏ ఆటగాడికైనా సాధ్యమా? కాని ఎవరు అడినా, ఆడకున్నా ధోనీ ఉంటే చాలు తుది ఓవర్లో గెలుపు మనదే అనే నమ్మకం ఇప్పుడు చెదిరిపోతోంది. చివరి ఓవర్‌లో తన బ్యాట్ విన్యాసాల వాడి కాస్త తగ్గినట్లు కనిపించగానే ధోనీపై ఎడాపెడా విమర్శలు రావడం సమంజసమేనా?
 
ప్రస్తుతం దేశం మొత్తం మీద టీమిండియాలో ధోనీ ఉండటాన్ని సమర్థిస్తున్న వారు ఇద్దరే ఇద్దరు కాబోలు. ఒకరు గవాస్కర్, రెండు. కోహ్లీ.. ధోనీ విలువ తెలుసు కాబట్టే వీరికి ధోనీ మరికొంతకాలం ఆడాల్సి ఉంటుందన్న ఎరుక కాస్త ఎక్కువగానే ఉంది. లెజెండరీ కెప్టెన్ జట్టుకు అందించిన విజయాలను చూసి మాట్లాడండి అని గవాస్కర్ మొత్తుకుంటున్నప్పటికీ ధోనీకి దక్కుతున్న ఏ గ్రేడ్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. 
 
ఆసియా దేశాల క్రికెట్ బోర్డులు టెస్టు క్రికెటర్లకి సరైన గుర్తింపు ఇవ్వడం లేదని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా విమర్శలు గుప్పించాడు. టెస్టు క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోనీకి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తుండటం, పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది కెరీర్‌కి రిటైర్మెంట్ ప్రకటించే వరకూ అగ్రశ్రేణి గ్రేడ్‌‌ వేతనాన్ని పొందడాన్ని ఆయన ఎత్తిచూపారు. టెస్టు క్రికెట్‌ మనుగడ కాపాడేందుకు ఆసియా దేశాలు శ్రద్ధ వహించాలని.. టీ20ల మోజులో పడి ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఫార్మాట్‌ని మసకబారేలా చేయెద్దని సూచించాడు.
 
‘క్రికెట్ బోర్డులు టెస్టు క్రికెటర్లకి తగినంత గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా ఆసియా దేశాల బోర్డులు. ఎందుకంటే ధోనీ, అఫ్రిది లాంటి వాళ్లు ఆ ఫార్మాట్‌ని వదిలేసినా.. టెస్టు క్రికెటర్ల‌తో సమాన హోదాను పొందారు. ఆటకి మంచి ఆదరణ ఉన్న ఆసియా దేశాలు కలిసి టెస్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడితే బాగుంటుంది. లేకపోతే.. టీ20ల మోజులో పడి భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని రమీజ్ రాజా హెచ్చరించాడు.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మహిళల ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగో విజయం.. వీళ్లపైన ఇంత చిన్న చూపా

ప్రపంచ క్రికెట్ యవనికపై ఇంత అనితర సాధ్య విజయాలు సాధిస్తున్న మహిళా క్రికెటర్లకు బీసీసీఐ ...

news

పాకిస్థాన్ నడ్డివిరిచిన ఏక్తాబిస్త్.. 74 పరుగులకే చాపచుట్టేసింది.. ఛాయ్‌వాలా కూతురైనప్పటికీ?

మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 95 పరుగుల ...

news

టీమ్‌కే చేతగాని చోట ధోనీమీద పడితే ఏం లాభం.. కసురుకున్న గవాస్కర్

లక్ష్య ఛేదనలో వరుసగా ఫెయిలవుతున్న మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియాలోంచి పీకేయాలని విమర్శలు ...

news

కోహ్లీ టీమ్‌కు బాగా తలంటిన సంజయ్ బంగార్.. మహిళా జట్టు స్పూర్తితో ఆడాలంటూ దెప్పులు

కుంబ్లేని కోచ్ పదవి నుంచి సాగనంపింది మొదలుకుని వివాదాలతో సాగుతున్న టీమిండియా పయనం ...