శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (15:55 IST)

టీమిండియా కోచ్‌గా కుంబ్లే.. రవిశాస్త్రికి మొండిచేయి.. గంగూలీ ఏమన్నాడంటే?

భారత క్రికెట్ జాతీయ జట్టుకు కోచ్‌ కావాలనుకున్నాడు రవిశాస్త్రి. అయితే ఆయనకు కోచ్ పగ్గాలు లభించలేదు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌ల కమిటీ అనిల్ కుంబ్లేను జట్టు కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే కోచ్

భారత క్రికెట్ జాతీయ జట్టుకు కోచ్‌ కావాలనుకున్నాడు రవిశాస్త్రి. అయితే ఆయనకు కోచ్ పగ్గాలు లభించలేదు. గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌ల కమిటీ అనిల్ కుంబ్లేను జట్టు కోచ్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే కోచ్ ఇంటర్వ్యూపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యులు తనను మంచి ప్రశ్నలు వేశారని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. కానీ రవిశాస్త్రి ఆరోపణలపై గంగూలీ స్పందించాడు. 
 
ఇంటర్వ్యూ ప్రక్రియంతా రహస్యమని.. రవిశాస్త్రి మాటలపై తానేమీ చెప్పబోనని గంగూలీ చెప్పాడు. గత మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య రవిశాస్త్రిని ఇంటర్వ్యూ చేసినట్లు గంగూలీ తెలిపాడు. క్యాబ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఉన్న తాను ఆపై సచిన్, లక్ష్మణ్‌లను కలిశానని వివరించాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవిశాస్త్రిని ఇంటర్వ్యూ చేసినట్లు గంగూలీ వ్యాఖ్యానించాడు. అయితే టీమిండియా డైరక్టర్‌గా ఎంత కష్టపడినా.. జాతీయ జట్టుకు విజయాలు సాధించిపెట్టానని... తనకు కోచ్ పదవి కూడా దక్కలేదని వాపోయిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా అభయ్‌ శర్మలు కొనసాగనున్నారు. కోచ్‌ కుంబ్లేను సంప్రదించిన తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు వారిని సహాయ కోచ్‌లుగా నియమించినట్లు బీసీసీఐ తెలిపింది.