శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2016 (17:21 IST)

రవిశాస్త్రికి కోచ్‌గా బాధ్యతలు: సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్?

ట్వంటీ-20 ప్రపంచ కప్ వరకు భారత జట్టుకు డైరక్టర్‌గా కొనసాగిన రవిశాస్త్రికి కోచ్‌గా బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తోంది. భారత క్రికెట్ జట్టుకు డైరెక్టర్‌గా రవిశాస్త్రికి మంచి మార్కులు పడడంతో కోచ్ పగ్గాలు ఆయనకే అందించాలని బోర్డు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ కూడా కోచ్‌గా రవి శాస్త్రి అయితే బాగుంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం. 
 
టీమిండియా జట్టులో అధికశాతం మంది ఆటగాళ్లు రవిశాస్త్రితో కలిసి పనిచేసేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని సీనియర్ ఆటగాళ్లు సైతం పేర్కొనడంతో అతని కోచ్ పదవి దాదాపు ఖాయమైనట్లే కనబడుతోంది. దీనిపై బీసీసీఐ అధికార ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.
 
భారత క్రికెట్ జట్టు తన టెస్టు సిరీస్‌లో భాగంగా వచ్చే జూలైలో  వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో కోచ్ పదవిపై తొందరగా నిర్ణయం తీసుకంటేనే మంచిదని బీసీసీఐ యోచిస్తోంది. ఈ పదవికి తొలుత టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పేరును బోర్డు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అయితే ద్రవిడ్ ప్రస్తుతం భారత్-ఎ, అండర్-19 జట్లకు చీఫ్ కోచ్గా ఉన్నాడు. ఇంకా అత్యున్నత స్థాయి బాధ్యతల్ని స్వీకరించేందుకు టైమ్ కావాలని ద్రవిడ్ సందిగ్ధత వ్యక్తం చేయడంతో బోర్డు పునరాలోచనలో పడింది. దీంతో రవిశాస్త్రి పేరు ఖరారు చేయాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.