బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 నవంబరు 2015 (12:37 IST)

ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్: 13వ స్థానంలో రవీంద్ర జడేజా

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ డేల్ స్టెయిన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో జడేజా 8 వికెట్లు పడగొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన జడేజా.. వర్షంతో రద్దైన రెండో టెస్టు మొదటి రోజే నాలుగు వికెట్లు నేలకూల్చిన సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. తాజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్ 5వ ర్యాంకులో ఉండగా, మురళీ విజయ్, పుజారా, కోహ్లి వరుసగా 12, 14, 17 ర్యాంకులకు పడిపోయారు. ఇక శిఖర్ ధావన్ 33వ ర్యాంకులో నిలిచాడు. అలాగే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మురళీ విజయ్ 12వ ర్యాంకులో నిలవగా, దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ డివిలియర్స్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.