బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 జులై 2015 (12:03 IST)

కలర్స్ ఛానల్‌లో స్టెప్పులేసిన ఇర్ఫాన్ పఠాన్‌: క్రికెట్ సంగతేంటి?

టీమిండియాకు సిసలైన ఆల్ రౌండర్‌గా ఎదుగుతున్న ఇర్ఫాన్ పఠాన్.. ఈ మధ్య మ్యాచ్‌ల్లో కనబడట్లేదు. ఇంకా అతని సోదరుడు కూడా అడపాదడపా తప్పిస్తే క్రికెట్ గ్రౌండ్ లో కనిపించడం లేదు. మరి ఇర్ఫాన్ పఠాన్ ఏం చేస్తున్నాడు?... ‘కలర్స్’ టీవీ చానెల్‌లో స్టెప్పులేస్తున్నాడు. 
 
నిజమండీ బాబూ, గురువారం ఆ టీవీ చానెల్‌లో ప్రసారమైన ‘ఝలక్ దిఖలాజా’ కార్యక్రమంలో ఓ ముద్దుగుమ్మతో కలిసి ఇర్ఫాన్ డ్యాన్స్ చేశాడు. క్రికెట్ గ్రౌండ్‌లో క్లీన్ షేవ్ గా కనిపించిన ఇర్ఫాన్, టీవీ ప్రొగ్రామ్‌లో మాత్రం సోదరుడు యూసుఫ్‌లా కాస్తంత గడ్డంతో కనిపించాడు.
 
కాగా వన్డే, ట్వంటీ-20ల్లో ఇర్ఫాన్ పఠాన్ భారత్‌లోనే 8వ అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 2003లో క్రికెట్లో అరంగేట్రం చేసి మంచి పేరు కొట్టేసిన ఇర్ఫాన్.. 2006 నుంచి ఫామ్ లేని కారణంగా జట్టులో స్థానం కోల్పోవడం ద్వారా మెల్లమెల్లగా క్రికెట్‌కు దూరమయ్యాడు. 
 
అయితే 2004వ సంవత్సరం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన పఠాన్.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 2004లో 18 వికెట్లు పడగొట్టాడు. అయితే 2005 నుంచి ఫామ్‌ను కోల్పోయిన పఠాన్ క్రికెట్‌కు దూరం అయ్యాడు.