Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రికెటర్ భువనేశ్వర్ ప్రేమలో పడ్డాడట.. 'వంకాయ ఫ్రై' హీరోయిన్‌తో తిరుగుతున్నాడా?

శుక్రవారం, 19 మే 2017 (14:27 IST)

Widgets Magazine

భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 'వంకాయ ఫ్రై' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ అనుస్మృతితో భువనేశ్వర్ కుమార్ ప్రేమాయణం నడుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో ఈ జంట పబ్బుల్లో కనిపించడం, కారులో ఒకరిపక్కన ఒకరు కూర్చుని షికారుకు వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతోందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. 
 
త్వరలోనే వీరిద్దరి పెద్దల అనుమతితో వివాహం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని సినీ పండితులు అప్పుడే జోస్యం కూడా చెప్తున్నారు. అంతేగాకుండా భువనేశ్వర్, అనుస్మృతిల జంట చూసేందుకు బాగుందని.. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీరి పెళ్లిపై నెట్టినింట పెద్ద చర్చే సాగుతోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. 
 
వీరిద్దరి వివాహం కూడా త్వరలోనే కానుందని.. ఇదే తరహాలో భువనేశ్వర్, అనుస్మృతిలు కూడా పెళ్లి ద్వారా ఒకటవుతారని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. తెలుగులో గత ఏడాది రిలీజైన సుస్వాగతం సినిమాలో అనుస్మృతి నటించిన సంగతి తెలిసిందే. ఇక భువనేశ్వర్.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
 
ఇప్పటికే జహీర్ ఖాన్ కూడా నటీమణి సాగరిక ఘట్గేతో నిశ్చితార్థమైనట్లు ప్రకటించగా, యువరాజ్ సింగ్ నటీమణి హజెల్ కీచ్ ‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. హర్భజన్ సింగ్ కూడా నటీమణి గీతా బాస్రాను పెళ్లి చేసుకుని పండంటి పాపాయికి తండ్రి అయ్యాడు. కోహ్లీ కూడా అనుష్కను త్వరలో పెళ్లాడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

స్మిత్ మా కెప్టెన్ అయినా.. ధోనీనే అత్యుత్తమ సారథి.. దటీజ్ ధోనీ.. బెన్‌స్టోక్స్ ట్వీట్..

మహేంద్ర సింగ్ ధోనీకి కూల్ కెప్టెన్ అనే పేరుంది. నిండు కుండ తొణకదు అన్నట్లు.. ధోనీకి ఎంత ...

news

చాంపియన్స్ ట్రోఫీ : మనీష్ పాండేను తొలగించారు.. దినేష్ కార్తీక్‌ను చేర్చారు.. ఎందుకు?

ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ (సీటీ)కి ఎంపికైన ఆనందం యువ బ్యాట్స్‌మన్ మనీష్‌ పాండేకు ...

news

గుండెపగిలిన సన్ రైజర్స్.. ఐపీఎల్ నుంచి ఔట్.. వర్షం నేపథ్యంలో లక్ష్యాన్ని ఛేదించిన గంభీర్ సేన

ప్రకృతి వైపరీత్యం ఎదురైతే ఎంత మంచి జట్టయినా బరిలోంచి ఎలా తప్పుకోవలిసి వస్తుందో సన్ ...

news

అబ్బా.. ఆస్ట్రేలియా పర్యటనే అత్యంత కఠినమైనది: సచిన్ టెండూల్కర్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్లో 1999లో ఆడిన ...

Widgets Magazine