బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (10:54 IST)

మెక్‌కల్లమ్ క్రికెటింగ్ లెవెన్ జాబితాలో ఒకే ఒక్కడుగా సచిన్!

భారత్ నుంచి ఏకైక క్రికెటర్‌గా కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఆల్‌టైమ్ క్రికెటింగ్ లెవెన్ జాబితాలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రే‌లియా మాజీ సారథి ర

భారత్ నుంచి ఏకైక క్రికెటర్‌గా కివీస్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఆల్‌టైమ్ క్రికెటింగ్ లెవెన్ జాబితాలో భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థానం సంపాదించుకున్నాడు. ఆస్ట్రే‌లియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ను వన్‌డౌన్‌లో ఎంపిక చేసిన మెకల్లమ్‌.. తన డ్రీమ్‌టీమ్‌లో క్రిస్ గేల్‌, టెండూల్కర్‌లను ఓపెనింగ్‌ జోడీగా ఎంపిక చేశాడు.
 
మరో ముగ్గురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌, షేన్‌వార్న్‌, మిచెల్‌ జాన్సన్‌, మెకల్లమ్‌ కూడా ఈ జట్టులో ఉన్నారు. ఇంకా విండీస్‌ దిగ్గజాలు రిచర్డ్స్‌, లారాతోపాటు న్యూజిలాండ్‌ ప్లేయర్లు టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌, జాక్వెస్‌ కలిస్‌ (దక్షిణాఫ్రికా)లకు మెకల్లమ్‌ తన ఆల్‌టైమ్‌ లెవెన్‌ జాబితాలో స్థానం కల్పించాడు.
 
జట్టు వివరాలు: క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్ (కెప్టెన్) జాక్వెస్ కల్లీస్, ఆడమ్ గిల్ క్రిస్ట్ (వికెట్ కీపర్), మిచెల్ జాన్సన్, షేన్ వార్న్, సౌథీ, బౌల్ట్.