బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (16:47 IST)

సారా సినిమాల్లోనా.. అవన్నీ ఊహాగానాలే: సచిన్ టెండూల్కర్

తన కుమార్తె సారా త్వరలోనే బాలీవుజ్ అరంగేట్రం చేయనుందనే వార్తలను ''భారత రత్న' సచిన్ టెండూల్కర్ ఖండించాడు మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని ట్వీట్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో 17 ఏళ్ల సార నటించనున్నట్టు మీడియాలో జోరుగా ప్రచారం సాగాయి. 
 
అయితే వార్తలను సచిన్ తోసిపుచ్చాడు. సారా చదువుకుంటున్నదని, ఆమె సినీ పరిశ్రమలో అరంగేట్రం చేస్తుందని వచ్చిన వార్తలు నిరాధామని సచిన్ ట్వీట్ చేశాడు. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేశాడు. ప్రస్తుతం స్టడీస్ మీద సారా దృష్టి పెట్టిందని సచిన్ తెలిపాడు.
 
కుమార్తె సారా సినీ రంగ ప్రవేశాన్ని ఖండించిన సచిన్ తన అరంగేట్రంపై ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడు. తన జీవిత కథ ఆధారంగా వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ సహకారంతో ‘200 నాటౌట్’ సంస్థ తీయబోయే సినిమాకు టైటిల్‌ను సూచించాల్సిందిగా సచిన్ ఇప్పటికే అభిమానులను కోరాడు. వారి నుం చి వచ్చే ప్రతిపాదనలను చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.