బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 మే 2016 (18:02 IST)

సచిన్ రికార్డును అలిస్టర్ కుక్ బ్రేక్ చేస్తాడా? టెస్టుల్లో పదివేల రికార్డును..?!

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ బ్రేక్ చేయనున్నాడు. చారిత్రక ఈడెన్ గార్డెన్‌ మైదానంలో 11 ఏళ్ల క్రితం సచిన్ టెస్టుల్లో పదివేల పరుగుల రికార్డు సృష్టించాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్ వయస్సు 31 ఏళ్లు. సచిన్ రికార్డుల్లో ఇది కూడా అరుదైనది. అలాంటి రికార్డును ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ చేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
అంతకంటే తక్కువ వయస్సులోనే టెస్టుల్లో పదివేల పరుగుల రికార్డును అందుకునేందుకు సై అంటున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 2005లో పాకిస్థాన్‌‍పై 31 ఏళ్ల వయస్సులో పదివేల పరుగులు చేశాడు. అప్పట్లో సచిన్ వయస్సు 31 సంవత్సరాల పది నెలలు. ప్రస్తుతం కుక్ వయస్సు అంతకంటే ఐదు నెలలు తక్కువగా ఉంది.
 
ఇకపోతే.. ప్రస్తుతం 31 ఏళ్ల కుక్ టెస్టుల్లో 9,964 పరుగులు సాధించాడు. ఇకపోతే.. మే 19 నుంచి ఇంగ్లండ్-శ్రీలంకల మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కుక్‌ మరో 36 పరుగులు సాధిస్తే అప్పటి సచిన్‌ వయసు కంటే ఐదు నెలల తక్కువ వయసులోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.