Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారత ఆటగాళ్ళలో పోరాటపటిమ ఉంది.. కోహ్లీ సేనకు సచిన్ అండ

ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (11:57 IST)

Widgets Magazine
sachin - kohli

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేతిలో స్వదేశంలో చిత్తుగా ఓడిన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లపై నలువైపులా విమర్శలు వస్తున్నాయి. కానీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రం టీమిండియాకు అండగా నిలిచింది. ఆదివారం ఉదయం ఢిల్లీలో జరిగిన 21 కిలోమీటర్ల మారథాన్‌ పోటీ జరిగింది. ఇందులో సచిన్ టెండూల్కర్ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత జట్టు సిరీస్‌ను కోల్పోలేదని, మన ఆటగాళ్లలో పోరాటపటిమ ఉందని అన్నారు. ఒక్క ఓటమిని చవి చూసినంత మాత్రాన పోరాడలేక చేతులు ఎత్తేసినట్టు భావించరాదని, తదుపరి జరిగే మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు పుంజుకుని, మంచి ప్రదర్శన ఇస్తారన్న నమ్మకం ఉందని సచిన్ చెప్పారు.
 
కాగా, పూణే వేదికగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరిగిన తొలిటెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఊహించ‌ని రీతిలో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న విషయం తెల్సిందే. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 440 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా, టీమిండియా ఆది నుంచే త‌డ‌బ‌డుతూ వ‌చ్చి రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. దీంతో ఆస్ట్రేలియా 333 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం న‌మోదు చేసుకుంది. దీంతో భారత జట్టు తీవ్ర నైరాశ్యంలో కూరుకునిపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

భారత ఆటగాళ్లకు కొరకరాని కొయ్యి ఒకీఫె... ఆ ముగ్గురి సలహాలతోనే టీమిండియా నడ్డివిరిచాడు

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. పూణె వేదికగా జరిగిన తొలి ...

news

ఆసీస్ గెలిచిందా.. శ్రీధరన్ ఓడించాడా?

భారత్-ఆస్ట్లేలియా టెస్ట్ సీరీస్ తొలి టెస్టులో ఆతిథ్య జట్టుపై ఆస్ట్లేలియా సాధించిన ...

news

వాళ్లు తేల్చుకోవడానికి వచ్చారు.. మనవాళ్లు ముందే తెలిపోయారు

విజయం మీద విజయం సాధిస్తూ, సీరీస్‌లకు సీరీస్‌లను చుట్టేస్తూ, ప్రత్యర్థులకు కొరకరాని ...

news

కోహ్లీకి వరద నిధుల నుంచి రూ.47.19 లక్షలిచ్చారా? హరీష్ రావత్‌కు కొత్త తలనొప్పి?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉత్తరాఖండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ...

Widgets Magazine