గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 12 నవంబరు 2015 (13:06 IST)

భారత్‌లో పాకిస్థాన్ ఆడేందుకు రెడీ.. అయితే ఎంత రెవెన్యూ ఇస్తారు: అఫ్రిదీ

భారత్‌లో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఎంత ఆదాయం ఇస్తారని పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అడిగాడు. పాకిస్థాన్‌తో భారత్ సిరీస్ నిర్వహించాలన్నదే తమ అభిమతమని పేర్కొన్న అఫ్రిదీ.. భారత్ వెళ్లి క్రికెట్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. అయితే బీసీసీఐ ఏది చెప్పినా... అందుకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. 
 
ఈ విషయాన్ని పీసీపీ చీఫ్ షహర్యార్ ఖాన్ కూడా చెప్పారని...ఆయన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని అఫ్రిది తెలిపాడు. 2012-13లో తాము భారత్‌లో సిరీస్ ఆడినప్పుడు బీసీసీఐకి కోట్లాది రూపాయల ఆదాయం సమకూరిందని అఫ్రిది గుర్తు చేశారు. అయితే పీసీబీకి ఏమీ రాలేదని అఫ్రిదీ చెప్పాడు. ఈ క్రమంలో, ఇప్పుడు ఇండియాలో పాకిస్థాన్ క్రికెట్ ఆడితే... పీసీబీకి ఎంత రెవెన్యూను ఇస్తారనే విషయాన్ని బీసీసీఐ లిఖితపూర్వకంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు.