బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 14 జులై 2016 (12:09 IST)

మా క్రికెటర్లు వేస్ట్.. ఒక్కరిలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు లేవు : అఫ్రిది సంచల వ్యాఖ్యలు

పాకిస్థాన్ క్రికెటర్లపై ఆ దేశ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. మా క్రికెటర్లు శుద్ధదండగ అని, ఒక్క క్రికెటర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలు లేవని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెటర్లపై ఆ దేశ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. మా క్రికెటర్లు శుద్ధదండగ అని, ఒక్క క్రికెటర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలు లేవని వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌ క్రికెటర్లలో ప్రతిభ పుష్కలంగా ఉందని చెప్తూ ఉంటారని, అదంతా ఉత్తిదేనని అఫ్రిది స్పష్టం చేశాడు.
 
తాజాగా బీబీసీ ఉర్దూకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్థాన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన క్రికెటర్లు లేరని కుండబద్దలుకొట్టినట్లు చెప్పేశాడు. చెప్పాల్సింది చాలా ఉందని, అయితే తనకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం ఉండటం వల్ల నోరు అదుపులో పెట్టుకుంటున్నానని చెప్పాడు. తమ దేశంలో క్రికెట్ పరిస్థితి సక్రమంగా లేదన్నాడు.
 
ఐసీసీ టీట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తాను క్రికెట్ నుంచి రిటైర్ కాకపోవడానికి కారణాన్ని వివరిస్తూ తమ జట్టులో ఉన్న వారి కన్నా తానే నయమని, అందుకే జట్టులో కొనసాగుతున్నానని అఫ్రిది చెప్పాడు. సమర్థవంతమైన జట్టు ఉండాలని తాను కోరుకున్నానని, కానీ ప్రస్తుతం ఉన్న ప్లేయర్లను చూసినపుడు జట్టులో స్థానం సంపాదించే సామర్థ్యం తనకే ఎక్కువ ఉందని అనిపించిందని వివరించాడు.