శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (14:07 IST)

వెస్టిండీస్ నడ్డి విరిచిన భారత బౌలర్లు.. ఫాలో‌ఆన్‌లో ఆడుతున్న కరేబియన్లు!

కరేబియన్ దీవుల పర్యటనకు వెళ్లిన భారత క్రికెటర్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఫలితంగా ఆతిథ్య వెస్టిండీస్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్ చేసి ఫాలో‌‌ఆన్‌ ఆడించ

కరేబియన్ దీవుల పర్యటనకు వెళ్లిన భారత క్రికెటర్లు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఫలితంగా ఆతిథ్య వెస్టిండీస్ జట్టును తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకే ఆలౌట్ చేసి ఫాలో‌‌ఆన్‌ ఆడించారు. ఫలితంగా తొలి టెస్టులో భారత్ పట్టు సాధించినట్టుయింది. ముఖ్యంగా. భారత బౌలర్లు షమీ, ఉమేష్ యాదవ్‌లు అద్భుతంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ జట్టు నడ్డి విరిచారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 161.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 566 పరుగులు చేసిన విషయం తెల్సిందే. ఇందులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ చేయగా, బౌలర్ అశ్విన్ సెంచరీ సాధించాడు. 
 
ఆ తర్వాకత విండీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 243 ఆలౌట్ చేసి మూడొందలకు పైచిలకు పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టు బిగించింది. భారత బౌలర్లు ఉమేష్ యాదవ్ (4/41), షమీ (4/25), సంచలన బౌలింగ్‌తో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు పట్టు దొరికింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలివుండగా, విండీస్ చేయాల్సిన పరుగులు 302 కాగా, చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.