శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (10:24 IST)

బ్యాటింగ్ ఆర్డర్ ఎవరి సొంతం కాదు.. నేనూ అతీతుడు కాదు: రోహిత్ శర్మ

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌పై స్పందించాడు. బ్యాటింగ్ ఆర్డర్ ఎవరి సొంతం కాదని, అందుకు తాను కూడా అతీతుడుని కాదని రోహిత్ స్పష్టం చేశాడు. జట్టు అవసరాలకు బట్టి ఆటగాళ్లు ఆడాల్సి ఉంటుందని రోహిత్ శర్మ తెలిపాడు. తానైనా, ఇంకో ఆటగాడైనా జట్టు అవసరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని రోహిత్ చెప్పాడు. 
 
కోచ్, మేనేజ్‌మెంట్ ఏ స్థానంలో ఆడమని చెబితే ఆ స్థానంలో ఆడాల్సి ఉంటుందని రోహిత్ తేల్చేశాడు. ఒక ఆటగాడి నుంచి జట్టు ఏం కోరుకుంటుంది? అనేది ఆటగాడు తెలుసుకోవాల్సి ఉంటుందని రోహిత్ స్పష్టం చేశాడు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కెప్టెన్ కోహ్లీ అత్యధిక పరుగులు సాధించగా, రోహిత్ రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.