శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 అక్టోబరు 2015 (14:59 IST)

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవం

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన బోర్డు సర్వసభ్య సమావేశంలో ఆయనను బీసీసీఐ సభ్యలంతా ఎన్నుకున్నారు. 
 
గత నెల 20న బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా హఠాన్మరణంతో అధ్యక్ష పదవి ఎన్నిక తప్పనిసరి అయింది. దీంతో ఈ పదవి కోసం మాజీ బాస్‌లు శ్రీనివాసన్, శరద్ పవార్‌లు పోటీపడినప్పటికీ.. చివరి నిమిషంలో తప్పుకున్నారు. 
 
దీంతో శశాంక్ మనోహర్ మరోమారు బీసీసీఐ పగ్గాలను స్వీకరించారు. ఈయన విజయం కోసం బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాగూర్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌లు గట్టిగా కృషి చేశారు. వీరికి బెంగాల్ క్రికెట్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా మద్దతు పలికారు. 
 
ఇదిలావుండగా, నూతన అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ నేతృత్వంలో కూడా సంస్కరణలు కొనసాగుతాయని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. బోర్డులో ఆరు నెలల క్రితం చేపట్టిన సంస్కరణలను కొసాగించాల్సిన అవసరం ఉంది. గతంలో అధ్యక్షుడిగా పని చేసిన మనోహర్‌ అందరి మన్ననలు అందుకున్నారు. దాల్మియా కాలంలో చేపట్టిన సంస్కరణలు నూతన అధ్యక్షుడి హయాంలో కూడా కొనసాగుతాయ ప్రకటించారు.