శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (12:33 IST)

క్రికెట్‌కు మా దేశం సురక్షితం కాదు.. మీరొచ్చి ప్రమాదాలను తెచ్చుకోవద్దు: ఫారిన్ క్రికెటర్లకు అక్తర్ వినతి

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. విదేశీ క్రికెటర్లు తమ దేశానికి వచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవ

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు విదేశీ క్రికెటర్లు రావొద్దంటూ విజ్ఞప్తి చేశారు. విదేశీ క్రికెటర్లు తమ దేశానికి వచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు.
 
పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు దాడులు జరిపినప్పటి నుంచి పాకిస్థాన్ అంతర్జాతీయ పోటీలకు ఆతిథ్యమివ్వలేక పోతోంది. పాకిస్థాన్ గడ్డపై క్రికెట్ ఆడటానికి విదేశీ జట్లు వెనకడుగు వేస్తున్నాయి. విదేశీ టూర్లకు వెళ్లడమో లేక తటస్త వేదికలపై ఆడటమో పాకిస్థాన్ జట్టు చేస్తోంది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌లో ఆడటానికి విదేశీ జట్లు రావద్దని హెచ్చరించాడు. క్వెట్టా పోలీస్ అకాడమీపై ఉగ్రవాదులు దాడి చేసి, 62 మంది పోలీసులను హతమార్చిన నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో తమ దేశంలో భద్రత లేదని, ఇక్కడ పర్యటించే విదేశీ జట్లకు ఇది ఏమాత్రం సురక్షితం కాదని, పరిస్థితులు మెరుగుపడేంత వరకు పాక్‌లో పర్యటించవద్దని సూచించాడు. అదేసమయంలో స్వదేశంలో మ్యాచ్‌లు ఆడేందుకు పాక్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలను అక్తర్ తప్పుబట్టాడు.