బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (12:11 IST)

టీమిండియా కొత్త కోచ్... అవన్నీ ఒట్టి పుకార్లే.. కొట్టిపారేసిన గంగూలీ..!

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ కోచ్‌ కాబోతున్నాడన్న వార్తను ఆయన తీవ్రంగా స్పందించారు. భారత క్రికెట్ జట్టుకు కోచ్ కాబోతున్నాడని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ.. కోచ్ అవుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అవన్నీ ఒట్టి పుకార్లే అంటూ కొట్టిపారేశారు. 
 
అంతేకాకుండా కొచ్ అవుతున్న సంగతిని తాను తొలిసారి వింటున్నానని గంగూలీ అంటున్నారు. కోచ్‌ పదవిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు దాల్మియాతో మాట్లాడినట్లు వస్తున్న వార్తలపై మండిపడ్డారు. 'అలాంటిదేమి లేదు. ఎవరా మాట అన్నదని ప్రశ్నించారు. బిసిసిఐ నుంచి ఎవరూ తనతో మాట్లాడలేదని, తాను కూడా ఎవరితోనూ మాట్లాడలేదని గంగూలీ స్పష్టం చేశారు.