శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (14:51 IST)

వామ్మో.. సచిన్ మహా ముదురు.. కఠినమైన ప్రశ్న సంధించాడు.. గంగూలీ డుమ్మా: రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో విజయం సాధించలేక పోయిన టీమిండియా మాజీ డైరక్టర్ రవిశాస్త్రి తన మనసులోని అక్కసును వెళ్లగక్కుతున్నాడు.

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలో విజయం సాధించలేక పోయిన టీమిండియా మాజీ డైరక్టర్ రవిశాస్త్రి తన మనసులోని అక్కసును వెళ్లగక్కుతున్నాడు. ప్రధాన కోచ్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలకు.. ఇంటర్వ్యూ కమిటీలో సభ్యుడైన సౌరవ్ గంగూలీ హాజరుకాలేదని ఆరోపించాడు. 
 
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మొత్తం 57 దరఖాస్తులు అందగా, వాటిలో నుంచి 21 దరఖాస్తులతో ఓ జాబితాను రూపొందించిన బీసీసీఐ... అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌ల నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ)ని కోరింది. 
 
ఇందుకోసం ఇటీవల కోల్‌కతాలో జరిగిన ఇంటర్వ్యూలు జరిగాయి. వీటికి రవిశాస్త్రి సహా పలువురు హాజరయ్యారు. అయితే ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ లేడని నిన్న రవిశాస్త్రి వెల్లడించారు.
 
అదేసమయంలో సచిన్, లక్ష్మణ్‌ల నుంచి కఠినమైన ప్రశ్నలు ఎదురయ్యాయని, వీటికి తనకు తెలిసిన మేరకు సమాధానమిచ్చినట్టు రవిశాస్త్రి చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తనకు తెలిసిందేమిటంటే.. సచిన్ పొట్టివాడైన మహా ముదురు అని గ్రహించినట్టు చెప్పుకొచ్చాడు.