గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 సెప్టెంబరు 2015 (13:16 IST)

దక్షిణాఫ్రికాతో 72 రోజుల సుదీర్ఘ సిరీస్: 7వేల అడుగుల ఎత్తులో బూట్ క్యాంప్!!

దక్షిణాఫ్రికాలో 72 రోజుల పాటు టీమిండియా సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది. ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా పేరొందిన సఫారీలతో మ్యాచ్‌లంటే టీమిండియాకు కాస్తంత కష్టమేనని క్రీడా పండితులు అంటున్నారు. అందుకే టీమిండియా ఆటగాళ్లకు పక్కాగా ట్రైనింగ్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే టీమిండియా ఆటగాళ్లను శారీరకంగానే కాకుండా మానసికంగా బలపడేలా బ్యూట్ క్యాంప్ నిర్వహిస్తోంది. 
 
ఈ క్యాంప్‌లో పాల్గొనడం కోసం మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు ధర్మశాలకు చేరుకోనుంది. సముద్ర మట్టానికి దాదాపు 7 వేల అడుగుల ఎత్తులో జట్టు సభ్యులకు ‘హై ఆల్టిట్యూడ్’ వాతావరణంలో సైనిక తరహా శిక్షణ ఉంటుంది. టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి సూచనల మేరకే ఈ తరహా కఠోర శిక్షణకు ప్లాన్ చేసినట్లు హిమాచల్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ పీసీఏ) ప్రెస్ కార్యదర్శి మోహిత్ సూద్ వెల్లడించారు. 
 
ఈ శిక్షణ శిబిరంలో ధోనీ గ్యాంగ్ కఠోర వ్యాయామాలు చేయనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ శిక్షణ శిబిరంలో ధోనీ సేన ట్రెక్కింగ్, దూకడం, పాకడం తదితర వ్యాయామాలు చేయనున్నారు.