శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జనవరి 2017 (16:39 IST)

జట్టు అవసరం మారింది.. కెప్టెన్సీపై బాధలేదు.. ఒక్క సారథితోనే మేలు: ధోనీ

వన్డే క్రికెట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్ ధోనీ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది వెల్లడించాడు. అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందని కొనియాడాడు

వన్డే క్రికెట్‌ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్ ధోనీ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది వెల్లడించాడు. అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందని కొనియాడాడు. టీమిండియా కెప్టెన్‌గా తాను ఎంతో ఎంజాయ్ చేశానని, అన్నీ ఫార్మట్లకు ఓకే కెప్టెన్ ఉంటేనే జట్టుకు ప్రయోజనం కలుగుతుందని ధోనీ వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ కోసం తాను ఏం చేసినా అది జట్టుకు చేసినట్లేనని అన్నాడు. తన జీవితంలో దేనికీ తాను విచారపడలేదని కెప్టెన్సీని వదులుకోవడంపై వేసిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 
శుక్రవారం పూణేలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నిజానికి 2015లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్ తనకు చివరదనుకున్నాను. 2007లో కెప్టెన్సీని స్వీకరించినప్పటికీ ఎంతో మార్పు వచ్చిందని, జట్టు అవసరం కూడా మారిందని.. ఇకపై బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుత ఏ స్థానంలో తాను బ్యాటింగ్ చేస్తున్నానో అదే స్థానంలో చేస్తానని.. అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా విరాటో కోహ్లీకి ఉందని, అవసరమైతే తాను సలహాలు ఇస్తానని చెప్పారు.
 
మొదటి నుంచి కూడా తాను కోహ్లీ చాలా సన్నిహితంగా మెలుగుతన్నట్లు తెలిపారు. ఎప్పుడు తనను మెరుగుపరుచుకోవాలని కోహ్లీ ప్రయత్నిస్తుంటాడని, తన క్రికెట్‌ను చాలా మెరుగుపరుచుకున్నాడని ధోనీ అన్నారు. వికెట్ కీపర్‌గా కోహ్లీకి తాను ఫీడ్ బ్యాక్ ఇస్తానని చెప్పారు.