బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 18 మే 2016 (12:11 IST)

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ద్రావిడ్ కంటే గొప్పోళ్ళు ఎవరున్నారు : గవాస్కర్

భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ద్రావిడ్ సరైనోడంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ తరంలో ద్రావిడ్‌ను మించిన క్రికెటర్ ఎవరున్నారంటూ ప్రశ్నించాడు. 
 
ద్రావిడ్‌‍ను కోచ్‌గా ఎంపిక చేసే విషయంపై పలు విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ఇంగ్లండ్ దేశానికి చెందిన డంకెన్ ఫ్లెచర్ నిష్క్రమణతో ఖాళీ అయిన స్థానంలో కోచ్‌ను తీసుకురావాలనుకుంటే ఆ పదవికి ద్రావిడ్ సరిగ్గా సరిపోతాడన్నాడు. 
 
క్రికెట్‌పై టెక్నికల్‌గా ఎంతో అనుభవమున్న ద్రావిడ్‌ను మించిన కోచ్ మరోకరు లేరు. ఇది నేను నిజాయితీగా చెప్పదల్చుకున్న మాట. బీసీసీఐ ఈ విషయాన్ని ఆలోచించాలి, మరోమాటకు తావులేకుండా ద్రావిడ్‌ను ఎంపిక చేయాలని అని సూచించాడు.