గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (14:43 IST)

ముమ్మాటికీ సచిన్ భారతరత్నమే.. సుప్రీం స్పష్టీకరణ : పిటీషన్ తోసివేత!

భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భారతరత్న అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ దాఖలైన పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వం ప్రదానం చేసిన భారతరత్న అవార్డును దుర్వినియోగం చేశాడని, సచిన్‌ను ఎందరో రచయితలు భారతరత్నమంటూ రచనలు చేశారని, కొన్ని పుస్తకాలకు 'భారతరత్న సచిన్' అని శీర్షికలు పెట్టారని, సచిన్ కూడా చాలా కార్యక్రమాల్లో దీనిని సమర్థించాడని నస్వా అనే వ్యక్తి తన పిటీషన్‌లో పేర్కొన్నాడు. 
 
ఈ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. సచిన్‌కు బాసటగా నిలిచింది. సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ కొట్టివేసింది. సచిన్‌కు ఈ పిటిషన్‌పై జరిపిన విచారణలో సచిన్ నియమ నిబంధనలను అతిక్రమించలేదని, ఎవరో బయటి వ్యక్తులు చేసిన తప్పుకు అతడిని బాధ్యుడిని చేయడం సబబు కాదని పేర్కొంటూ న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.