గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (17:28 IST)

కెరీర్‌లో దశాబ్దాన్ని పూర్తిచేస్తున్న సురేష్ రైనా.. తొలి మ్యాచ్‌లో తొలి బంతికే..?

టీమిండియా స్టార్ క్రికెటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి సరిగ్గా పదేళ్లు పూర్తయ్యింది. 2005 జూలై 30న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో రైనా అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. పదేళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సురేష్ రైనా... తన తొలి మ్యాచ్‌లో మాత్రం మొదటి బాల్‌కే ఔట్ అయ్యాడు. 
 
ఇప్పటి వరకు 218 వన్డేల్లో 5 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5,381 పరుగులు పూర్తి చేశాడు. అలాగే 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు వన్డేల్లో 35, టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టాడు.  
 
తొలి మ్యాచ్‌లో మొదటి బాల్‌కే ఔటై నిరాశ పరచిన రైనా ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. అనేక విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. బ్యాట్స్‌ మెన్‌గానే కాకుండా బౌలర్‌గా కూడా తన ప్రతిభను నిరూపించుకున్నాడు రైనా. ఐసీసీ క్రికెటర్‌ ర్యాంకింగ్స్‌లో బ్యాట్స్‌మెన్‌గా ప్రస్తుతం 19వ స్థానంలో ఉన్నాడు. కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ 10వ స్థానం సంపాదించుకున్నాడు.