శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (13:05 IST)

ఆ సమస్య అన్నీ జట్లకూ ఉంది : కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ

ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ జట్టు విజయాలు సాధించినప్పటికీ ఓ సమస్య మాత్రం తీరడం లేదు. తొలుత బ్యాటింగ్‌ను చేపట్టి భారీ లక్ష్యాలను ప్రత్యర్థులకు నిర్దేశిస్తున్నా ఇన్నింగ్స్ చివరలో తడబాటు మాత్రం తగ్గడం లేదు. చివరి బ్యాట్స్‌మెన్ పరుగులను రాబట్టడంలో తడబడి వికెట్లను చేజార్చుకుంటున్నారు. 
 
ఈ సమస్యపై ధోనీ సమర్థిస్తూ.. ఈ సమస్య భారత్‌దే కాదని, అన్ని జట్లకూ ఉందన్నాడు. చివరి వికెట్ బ్యాట్స్‌మన్‌కు పేస్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయాలంటే కష్టమేనని, బ్యాటింగ్ స్పెషలిస్ట్‌లనైతే దూకుడుగా ఆడమని చెప్పగలమని అన్నాడు. 
 
కానీ అశ్విన్, షమీ లాంటి వాళ్లు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓవర్‌కు 8,9,10 పరుగులు ఆశించకూడదని చెప్పాడు. గ్రూప్ దశ ముగిసేలోపు పరిస్థితులపై అంచనాకొచ్చి భారీ స్కోర్లు సాధించేందుకు కృషి చేస్తాం అని ధోనీ అన్నాడు.