శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2015 (17:11 IST)

గుండెనొప్పితో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన క్రికెటర్ రాహుల్ సావంత్!

గుండెనొప్పితో విలవిల్లాడుతూ మైదానంలో కుప్పకూలిన రాహుల్ సావంత్ అనే క్రికెటర్‌ను ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ మైదానంలో ఆటగాళ్లు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. తాజాగా, ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్న రాహుల్ సావంత్ అనే ఆటగాడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. 
 
 
గుండెనొప్పితో విలవిల్లాడుతున్న అతడిని సహచరులు బాంబే హాస్పిటల్‌కు తరలించారు. 'డాక్టర్ హెచ్.డీ కంగా' లీగ్‌లో సావంత్ దహిసార్ క్రికెట్ క్లబ్ తరపున వికెట్ కీపర్ బ్యాట్స్ మన్‌గా ఆడుతున్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, గుండెపోటుకు గురయ్యాడు. ఆతని పరిస్థితి చూసి సహచరులు తీవ్ర ఆందోళనకుగురవడంతో పాటు ఆస్పత్రికి తరలించారు. సకాలంలో తీసుకెళ్లడంతో అతడి ప్రాణాలు నిలిచాయి. ప్రస్తుతం సావంత్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. 
 
'మరికాస్త ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలియాలి' అని దహిసార్ సీసీ కెప్టెన్ ప్రవీణ్ గోగ్రీ తెలిపాడు. 34 ఏళ్ల సావంత్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకని.. మైదానంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చాం.. ఆతని పరిస్థితి మెరుగ్గా ఉందన్నాడు.